టిఎన్జి యూనియన్ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుసేని ముజీబ్ గారి 52వ జన్మదిన వేడుకలు కేంద్ర సంఘ కార్యాలయంలో పెద్దలు కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
టీఎన్జీస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మధ్యాహ్నం యం.ఎన్.జ్. క్యాన్సర్ ఆసుపత్రిలో అమ్మవారి ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు అటు నుండి హజరత్ యూసుఫ్ బాబా దర్గాలో చాదర్ సమర్పించి
పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకి డాన్ బాస్కో అనాధ శరణాలయంలో దైవ ప్రార్థన తర్వాత భోజనం ఏర్పాటుతొ పాటు ఒక నెలసరికులు ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. కార్యదర్శి కే.విక్రమ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు,వివిధ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యుల సమక్షంలో కేక్ కట్టింగ జరిగింది.
కార్యక్రమంలో సభ్యులు కేఆర్ రాజ్ కుమార్, బాల్ రాజ్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, నరేష్ కుమార్, ఖలీద్ అహ్మద్, వైదీక్ శాస్త్ర, శ్రీధర్ శ్రీమతి సుజాత శ్రీమతి గీత, మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్ మాజీ సభ్యులు శ్రీమతి జానకి, కేంద్ర సంఘ నాయకులు పర్వతాలు, కొండల్ రెడ్డి,
జిల్లా పిఆర్ఓ సయ్యద్ జాంగిర్ మొహమ్మద్ వహీద్ మహమ్మద్ ముస్తఫా షరీఫ్, మిత్రులు ఉస్మాని అలీ ఉస్మాని, రామకృష్ణారెడ్డి, రోహిత్, రాజేంద్రనగర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతొ సుమారు 58 యూనిట్స్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
