గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుదవారం నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ నగరంలో ఈ నెల 8న దుబ్బ లోని ఓ వైన్స్ ముందు ఉన్న మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.