తెలంగాణ కొత్త డీజీపీగా డాక్టర్ జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. . ఇప్పటి వరకు డీజీపీగా కొనసాగిన రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసారు.
రవి గుప్తా ను ఎన్నికల కమిషన్ నియమించింది. గతంలో డీజీపీ గా ఉన్న అంజనీ కుమార్ ఎన్నికల విధుల్లో నియమావళి ని ఉల్లఘించారనే నేపం తో సస్పెన్షన్ వేటు పడింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రవిగుప్తా ను లోకసభ ఎన్నికల దాక కొనసాగించింది. కానీ ఆయన పనితీరు మీద సీఎం రేవంత్ గత కొద్దీ రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. అందుకే కొత్త పోలీస్ బాస్ కోసం సర్కార్ నెలరోజులుగా కసరత్తులు చేస్తుంది.
సీవీ ఆనంద్ తో పాటు శివధర్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ శివధర్ రెడ్డి ఇంకా డీజీపీ గా పదోన్నతి రాలేదు. ఆనంద్ కు ఇంకా మూడేళ్ళ సర్వీస్ ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది పదవీ విరమణ చేసే జితేందర్ వైపు సర్కార్ మొగ్గు చూపింది.
పంజాబ్ లోని జలంధర్ ప్రాంతానికి చెందిన జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సమర్థుడే కాకుండా ఎలాంటి వివాదాలలకు తావులేని సర్వీస్ ఉంది. అందుకే ఆయన ను డీజీపీ గా నియమించింది