ఓ రిటైర్డ్ ఐపీఎస్ చెందిన భూమిని ఆయనకే తెలియకుండా అమ్మకానికి పెట్టారు. ఆయన ఒప్పంద పత్రాల మీద ఆయనే సంతకం చేసి నట్లుగా నమ్మించారు. చివరికి ఫోర్జరీ సంతకం బాగోతం బట్టబయలు అయింది..
గతంలో హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహించిన ఓ ఐపిఎస్ సంగారెడ్డి జిల్లా అందోల్ ప్రాంతంలో 57 ఎకరాల భూమి ఉంది. అయితే ఆయన ఆ భూమి వైపు ఏళ్ల తరబడిగా రాకపోవడంతో కొందరు కేటుగాళ్లు ఆ భూమి మీద కన్నేశారు.
సంజీవ రెడ్డి, రాథోడ్ సుధాకర్, రవీందర్. లు ఐపీఎస్ అధికారికి చెందిన 57ఎకరాల భూమిని గుట్టు చప్పుడుకాకుండా అమ్మకానికి పెట్టేసారు.
హైదరాబాద్ కు చెందిన ఓ బిల్డర్ కు 22 కోట్ల 30లక్షల రూపాయలకు ఆ భూమి విక్రయించడానికి విక్రయ ఒప్పందం చేసుకున్నారు. సదురు బిల్డర్ నుంచి అడ్వాన్స్ గ రూ 11లక్షలు తీసుకున్నారు.
అయితే భూమి కొనుగోలు ఒప్పందం చేసుకున్న బిల్డర్ ఆ ప్రాంతంలో హడావుడి చేయడంతో పాటు తహశీల్ కార్యాలయంలో అరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ లోపు సదురు ఐపీఎస్ అధికారికి కూడా తెలియడం తో హుటాహుటిన సంగారెడ్డి కి వచ్చి ద ఎస్పీ రూపేష్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు .
కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.