గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 2.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన నిజామాబాద్ పరిధిలో బుదవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం..
ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ డిప్యూటీ కమిషనర్ వీ.సోమిరెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని చంద్రశేఖర్ కాలాని లో ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ సిబ్బంది నగరంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ మేరకు ఇద్దరు వ్యక్తులు అయిన మిర్చి కాంపౌండ్ కు చెందిన బాబఖాన్, బీబీపేట్ కి చెందిన కేతవత్ కిషన్ లు చంద్రశేఖర్ కాలని ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం పైన అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.
వారిని పట్టుకుని తానికి చేయగా వారి వద్ద 2.250కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు.
ఇద్దరి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ అధికారులు వెల్లడించారు.
ఈ తనిఖీలో ఎస్ఐ నరసింహ చారి,నారాయణ రెడ్డి, భోజన్న,తదితరులు పాల్గొన్నారు.
