నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆద్వర్యంలో రెవెన్యూ అధికారులు,మరియు శానిటైజింగ్ అధికారులు సంయుక్తం గా బుదవారం నగరం లోని పలు స్కూల్స్, దవాఖానల పై తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాపర్టీ టాక్స్, పన్నులు చెల్లించని, వ్యత్యాసం ఉన్న పలు వాటికి నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్, లేని వాటికి నోటీసు లు ఇచ్చి జరిమానా విధించమని తెలిపారు.
నగరంలోని నాలెడ్జ్ పార్క్ స్కూల్ లో టాక్స్ పన్నులు, NOC శానిటేషన్ సర్టిఫికెట్, కారణంగా నోటీసులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా సిటీ హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలో రెవెన్యూ ఆద్వర్యంలో నరేందర్ టీమ్, శనిటైజింగ్ ఆధ్వర్యంలో షాయిద్ అలీ టీమ్ పాల్గొన్నారు.




