నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనీ పోలీస్ ఉద్యోగులు విధుల నిర్లక్ష్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితీ తయారైంది.ఏం చేసినా అడిగే వాళ్లే లేరనీ డ్యూటీకి ఇష్టం ఉంటే రావడం లేదంటే ఎగనామం పెట్టడం పరిపాటిగా మారింది.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని పోలీస్ బూత్ సిబ్బంది మంగళవారం రాత్రి పోలీస్ బూత్ లో ఎవ్వరూ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ ఆసుపత్రికి వచ్చిన రోగుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
అయితే మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.అందుకు మృతి చెందిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించేందుకు పోలీస్ బూత్ అధికారులు రిజిష్టర్ లో నమోదు చేసేందుకు వెళ్ళగా అక్కడ విధుల్లో ఎవ్వరూ లేకపోవడంతో సరాసరి విధుల్లో ఉన్న వార్డ్ బాయ్స్ మార్చురీకి తరలించారు.
అదే విధంగా అర్ధ రాత్రి సమయంలో ఆర్సపల్లీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మరో వక్తిని కొట్టడంతో సదరు ఆ వ్యక్తి చికిత్స నిమిత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సరాడు a వ్యక్తి పోలీస్ బూత్ లో ఎంట్రీ ఇవ్వడానికి వెళ్ళగా అక్కడ ఎవ్వరూ లేరు.
దాంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బంది వారే ఎంట్రీ చేసి ఆ వ్యక్తికి వైద్యం అందించారు. అదేవిధంగా మరో రెండు మృతదేహాలు మార్చురీకి రాగా సదరు బాధితులు ఒకటవ టౌన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
అందుకు వారు అక్కడ ఉన్న సిబ్బంది తో ఎంట్రీ చేసుకొని పంపండి అంటూ ఒకటవ టౌన్ పోలీస్ అధికారులు కర్కశంగా సమాధానం ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.