ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మాత్యులు *గంగాపురం కిషన్ రెడ్డి * మరియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహిళా మోర్చా రాష్ట్ర ప్రబారీ చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్ మహిళా మోర్చా నాయకులు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి *శ్రీమతి కొత్త నీరజ మరియు జూబ్లీహిల్స్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు *శ్రీమతి డోంగరి రాజకళ * ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు ధర్నాలో పాల్గొనడం జరిగింది.
రాష్ట్ర ఎన్నికల సందర్బంగా కాంగ్రస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి రోజుకో కొత్త కథ చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు..
*మహిళలకు ప్రతి నెల ఇస్తాం అన్న 2500 రూపాయలు* ఇంతవరకు మొదలు కాలేదు..
కొత్తగా పెళ్లి చేసుకునే వారికి *ఒక లక్ష రూపాయలు మరియు తులం బంగారం,కాలేజీ కి వెళ్ళే వారికి స్కూటీ* వంటివి ఈరోజు కి అమలు కాకపోవడాన్ని తెలంగాణా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ తీవ్రంగా పరిగణిస్తుంది..
