ఏడో తరగతి చదువుతోన్న ఓ విద్యార్ధి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన నారాయణ స్కూల్ లో చోటుచేసుకుంది. హైదారాబాద్ హయత్ నగర్ నారాయణ స్కూల్ లో ఎడో తరగతి చదువుతున్న లోహిత్ సోమవారం రాత్రి హస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గమనించిన స్కూల్ సిబ్బంది లోహిత్‌ను ఆసుపత్రికి తరలించగా.. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
అనంతరం హుటాహుటిన పాఠశాలకు వద్దకు చేరుకున్న లోహిత్ కుటుంబ సభ్యులకు, బంధువు అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ స్కూల్ ఎదుటే బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హస్టల్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.మృత దేహం ను పోస్టు మార్దరం కు తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
