నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఓ బాలుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. అక్షిత్ కుమార్ అనే బాలుడు తెల్లవారుజామున చెరువు సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసింది. బాలుడు కేకలు వేయడంతో ఎలుగుబంటి అడవి ప్రాంతంలోకి పారిపోయింది. గాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
