నందిపేట మండల కేంద్ర యూనియన్ బ్యాంకు లో సోమవారం బాద్గుణ గ్రామానికి చెందిన తన్నూరి నాగన్న s/o బుచ్చన్న వయసు :55 సం. తన వద్ద ఉన్న 26 వేల చెక్కును విత్ డ్రా చేసుకునేందుకు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకుకు వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తి అతనిని పరిచయం చేసుకొని నాకు బ్యాంకు క్యాషియర్ తెలుసునని ఆ 26 వేల చెక్కును తీసుకుని డబ్బులు డ్రా చేసుకొని బుచ్చన్నను మోసం చేసి మెల్లిగా బ్యాంకు నుండి జారుకున్నాడు.
బుచ్చన్న కు ఆ వ్యక్తి కనపడక పోయేసరికి తను మోసానికి గురైనానని తేరుకొనేసరికే కేటుగాడు ఉడాయించాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
సదర వ్యక్తి ఫిర్యాదు అందుకొని ఎస్సై చిరంజీవి వెంటనే స్పందించి యూనియన్ బ్యాంకు, పరిసర ప్రాంతాలు, బస్టాండ్ ప్రాంతాలలో తనిఖీ చేపట్టారు. అలాగే బ్యాంకులో ఉన్న సిసి ఫుటేజ్ లలో మోసగాడి ని గుర్తించి దర్యాప్తు చేపడుతున్నారు. మోసగాడి చిత్రాలను సోషల్ మీడియా గ్రూపులలో సదరు గుర్తుతెలియని వ్యక్తిని ఎవరైనా చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అలాగే అపరిచిత వ్యక్తుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానిత వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని నూతన ఎస్సై చిరంజీవి అన్నారు.
