వేగంగా వెళ్తున్న ఓ కారు 44 వ జాతీయ రహదారిపై బోల్తా పడిన ఘటన డిచ్ పల్లి పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… మధ్య ప్రదేశ్ కి చెందిన కుటుంబ సభ్యులు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు.
ఈ మేరకు సంక్రాంతి సెలవులు నేపథ్యంలో కుటుంబ సభ్యుల తో కలిసి మధ్య ప్రదేశ్ కు వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో డిచ్ పల్లి వద్ద డివైడర్ ను ఢీ కొనడంతో కారు బోల్తా పడింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణించే వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
