నిజామాబాద్ జిల్లా పోలిస్ కమిషనరేట్ పరిధిలోనీ ఓ యువతిపై ఆకతాయిలు చెలరేగి పోయారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోఓ యువతి పై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15 న సిద్దపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి పై రాత్రి సమయంలో సిద్దాపూర్, వన్నెల్ (కే) ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు.
దీంతో జంకుతున్న సదరు యువతి పారిపోయే క్రమంలో ఐదుగురు అయిన రాసరి సాయిరాం,కొండూరు రాహూల్, విఘ్నేశ్, సృజన్, సాయికిరణ్ లు వెంటాడి వేధించి, దాడిచేసినట్లు తెలిపారు.
దీంతో సదరు యువతి కుటుంబ సభ్యులు నంది పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
