పతంగి తీయడానికి వెళ్లిన ఓ విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.నగరంలోని మహబూబ్ కాలనీకి చెందిన షేక్ జిషాంత్ తన ఇంటి బంగ్లా పై సర్వీస్ వైర్ కు పతంగి ఉందని వెళ్లి చేతితో లగుటకు ప్రయత్నం చేయగా సర్వీస్ వైర్ కు చేతు తగలటంతో కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయాలయ్యాయి.
దీంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
