నిజామాబాద్ నగరంలో బోగస్ పట్టాలను సృష్టించి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారనీ ఆదే ప్రవీణ్ కుమార్ ద్వజమెత్తారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
నాగరంలోని భూములను అధికారుల అండదండలతో అమర్ సింగ్ అనే ముఠా ప్రజల భూములను పోర్జరి సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారనీ తెలిపారు. భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే దుయ్యబట్టారు.
కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ పట్టాలను సృష్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనీ తెలిపారు. ప్రజల భూములు కబ్జా చేస్తూ కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా వ్యక్తులు భూకబ్జాల విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారు.అలాగే భూమి యజమానులపై తప్పుడుగా అట్రాసిటీ కేసులు పెడతమంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ విషయంపై గతలోని సిపి కు ఫిర్యాదు చేశారనీ తెలిపారు.అలాగే కొందరు లాయర్ల తో కుమ్ముక్కై కోర్టులను కూడా తప్పు దోవ పట్టిస్తున్నారాని పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల అండదండలతో ఇలా వర్ని రోడ్ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఇటువంటి తప్పుడు పనులు జరుగుతున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో పైసా ఎల్లయ్య, ఈర్ల శేఖర్, తుమ్మ నాగభూషణం, వేముల దేవిదాస్, స్వర్గం రమేష్, పాశకంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు..
