HomeTelanganaNizamabadఅర్వింద్ మీద మాటలు జాగ్రత ....ముందు నీ నియోజకవర్గం చక్కదిద్దుకో.....మంచిప్ప లిఫ్టు ఏమైంది ......భూపతి రెడ్డి...

అర్వింద్ మీద మాటలు జాగ్రత ….ముందు నీ నియోజకవర్గం చక్కదిద్దుకో…..మంచిప్ప లిఫ్టు ఏమైంది ……భూపతి రెడ్డి కి ఘాటుగా రిప్లై ఇచ్చిన బిజెపి అధ్యక్షుడు దినేష్ కులాచారి..

దశాబ్దాల పసుపు రైతుల కల నెరవేర్చిన అర్వింద్ ను మెచ్చుకోవాల్సింది పోయి రూరల్ ఎమ్మెల్యే సొల్లు మాట్లడడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ హితవు పలికారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గం ను గాలికి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారని మంచిప్ప మాసాని ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారమే నిర్మాణం చేపడుతాము అని ఎన్నికల హామీ ఇచ్చాడని ఆ పనులకు అతీగతీ లేకుండా పోయిందన్నారు .

అలాగే రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చి గెలిచి సంవత్సరమైనా ఇంతవరకు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదనీ విమర్శించారు.ఇప్పటివరకు తెలంగాణ యూనివర్సిటీకి ఒక రూపాయి కూడామంజూరి చేయించ లేక పోయారన్నారు.

పసుపు బోర్డు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని చెప్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ను ఎందుకు తీసుకురాలేదనీ దినేష్ కూలాచారి ప్రశ్నించారు.

ఇందూర్ పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కల సంక్రాంతి పండుగ రోజున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి పియూష్ గోయల్ , పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి పసుపు బోర్డు,నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని వర్చువల్ గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదిక పైన అధికారులు, ప్రజాప్రతినిధులు తప్ప ఎవరూ కూడా మా పార్టీ కార్యకర్తలు వేదిక పైన కూర్చోలేదనీ వివరించారు. పసుపు బోర్డులో తుమ్మల నాగేశ్వరరావు పాత్ర ఏంటిదో ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. .

అలాగే పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని పిలువలేదని అడుగుతున్న భూపతి రెడ్డి ఏ హోదా ఉందని షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో, వినయ్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో, సునీల్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారనీ ప్రశ్నించారు.వర్చువల్ గా జరిగినటువంటి పసుపు బోర్డు కార్యక్రమం కేవలం మన నిజామాబాద్ లోనే కాదు దేశంలో దాదాపు 12 ప్రాంతాలలో వర్చువల్ గా ప్రారంభించడం జరిగిందనీ పేర్కొన్నారు.

గడిచిన ఏడాది కాలంలో భూపతి రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల గురించి,తీసుకొచ్చిన ఫండ్ గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని లేని పక్షంలో వచ్చేనెల ఒకటో తేదీన మీపైన మేము చార్జెస్ విడుదల చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments