మండల కేంద్రంలో నకిలీ మద్యం కలకలం రేపింది.వ్. మండల కేంద్రానికి చెందిన ఓ రైతు అంబేద్కర్ చౌరస్తాలోని ఓ వైన్స్‌లోనిమద్యం బాటిల్ కొనుగోలు చేసారు. మద్యం తాగడానికి ఆ బాటిల్‌ను తెరవగా, మద్యం కంపు వాసన రావడంతో అనుమానం వచ్చిన రైతు వెంటనే వైన్ షాప్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు.
ఈసందర్భంగా రైతు మంతెన శీను మాట్లాడుతూ.. మండల కేంద్రంలో అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోందని, ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యం విక్రయించి అడ్డగోలుగా చేస్తున్న అక్రమ వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. .
మందు బాటిల్‌లో చీఫ్ లిక్కర్ స్పిరిట్ వంటి నకిలీ మద్యం కలుపుతున్నారని వారు అనుమానం వ్యక్తం చేశారు . ఫిర్యాదు చేసిన వారిలో మంతెన శీను, మాచర్ల పెద్ది సాయిలు, ఉమ్మెడ నర్సింహ, హరిబాబు, సాకలి గంగాధర్ తదితరులున్నారు.
