HomeLaw and Orderనిజామాబాద్‌లో విద్యుత్ అర్టిజన్ కార్మికుల ధర్నా: రెగ్యులర్ పోస్టుల కోసం డిమాండ్

నిజామాబాద్‌లో విద్యుత్ అర్టిజన్ కార్మికుల ధర్నా: రెగ్యులర్ పోస్టుల కోసం డిమాండ్

నిజామాబాద్ పట్టణంలోని వర్ణి చౌరస్తా వద్ద ఈ రోజు విద్యుత్ అర్టిజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. వారు గత 18 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నామని, తమ సేవలను గుర్తించి రెగ్యులర్ పోస్టులుగా మారుస్తూ తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అర్టిజన్ కార్మికుల విన్నపం: ఉద్యోగ హోదా స్పష్టతతోపాటు సమాన వేతనం అందించాలని డిమాండ్ మేము విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అర్టిజన్ కార్మికులమైన మేము దృష్టిలో పర్మినెంట్ కార్మికులమే. అయితే, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థ లెక్కల ప్రకారం మమ్మల్ని అవుట్‌సోర్సింగ్ కార్మికులుగా పరిగణిస్తున్నారు.

ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని, మా సేవలను అధికారికంగా పర్మినెంట్ హోదాలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో, ఒక సబ్‌స్టేషన్‌లో ఐదుగురు కార్మికులు చేయాల్సిన పనిని కేవలం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులతో చేయిస్తున్నారు.

మేము 365 రోజులు క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తూ, సంవత్సరానికి 450 గంటలకు పైగా డ్యూటీలు చేస్తున్నాము. మా పని భారం, సమయం, మరియు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, మాకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలి.

**సేవా నియమాలు ఉల్లంఘన:** –

*స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్* ప్రకారం, ఒక్కో షిఫ్ట్ ఎనిమిది గంటల కాలంతో ఉండాలి. – వారాంతపు సెలవు హక్కు కల్పించాలి. – అదనపు పని (ఓవర్‌టైమ్) చేపిస్తే, అందుకు అనుగుణంగా ఓవర్‌టైమ్ వేతనం చెల్లించాలి. అయితే, ప్రస్తుత పరిస్థితేనటైతే ఈ నియమాలు పూర్తిగా అమలు కావడం లేదు. మేము భారీ పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నా, మా సేవలకు తగిన గుర్తింపు లేకపోవడం మనోవేదన కలిగిస్తోంది.

మా విన్నపం: – మమ్మల్ని రెగ్యులర్ కార్మికులుగా గుర్తించి, అధికారిక హోదా కల్పించాలి. – స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం వేతనాలు, ఓవర్‌టైమ్, మరియు సెలవులను అమలు చేయాలి. – పని బరువు తగ్గించేందుకు అవసరమైన మందుబాట్లు చేపట్టాలి.

మా సమస్యలపై ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థ తక్షణం స్పందించి, మాకు న్యాయం చేయాలి.ఈ ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని నినదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments