ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడిన ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వం పైనే నిందలు వేయడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది.
టిఆర్ఎస్ అధికారంలో ఉన్న చివరి రెండు సంవత్సరాలలో పెండింగ్లో ఉంచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంటే వాటిని పంచే కార్యక్రమంలో వేల్పూర్, భీమ్గల్,ముప్కల్, కమ్మరపల్లి ప్రాంతాలలో ప్రశాంత్ రెడ్డిని ప్రజలు ప్రశ్నించినందుకే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నీ బహిష్కరిస్తున్న అని చెప్పి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకోవడం జరిగింది.
ఒకవేళ ప్రశాంత్ రెడ్డి తులం బంగారం ఇవ్వడం లేదు అని చెక్కుల పంపిణీ బహిష్కరిస్తే గడిచిన సంవత్సర కాలంగా ఎందుకు చెక్కులు పంపిణీ చేశారో చెప్పాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉంది.
గ్రామాలలో మహిళలు ప్రశాంత్ రెడ్డిని నిలదీసి గతంలో మీరు అధికారంలో ఉన్న రెండు సంవత్సరాలలో ఎందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయలేదు అని ప్రశ్నించడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు మోపి పక్కకు తప్పుకుంటున్న అని చెప్పడం జరిగింది.
ప్రశాంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రశాంత్ రెడ్డికి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం కూడా లేదు అందుకే గత మూడు నెలల క్రితం మంజూరైన చెక్కులను కూడా బాల్కొండలో ఇప్పటివరకు పంచలేదు.
ఎందుకంటే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రశాంత్ రెడ్డి ముందుకు వస్తే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో ఎక్కడ తప్పులు బయట పడతాయో అని భయంతోనే ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నాడు.
ప్రజా ప్రతినిధిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి వచ్చిన రాకున్నా ప్రజలకు మంజూరైన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల సమయం ముగియకముందే అధికారులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది.
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ,ప్రశాంత్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం వల్లనే రెండు సంవత్సరాలు లబ్ధిదారులకు చెక్కులు రాకుండా ఆలస్యం అయ్యాయి. కావున వెంటనే ప్రశాంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలి.
టిఆర్ఎస్ బిజెపి చెప్పే అబద్ధపు మాటలను ప్రజలు నమ్మవద్దని గతంలో వారు నిర్లక్ష్యంతో పెండింగ్లో ఉంచిన చెక్కులను, బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది.
ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గాని, ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచడం గాని, రైతులకు రైతు రుణమాఫీ చేయడం గానీ, అదే విధంగా ఈనెల 26వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని పేదలకు 12 వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలలో పాలుపంచుకొని ప్రశాంత్ రెడ్డి కేవలం తులం బంగారం పేరుతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ బహిష్కరించడం
చూస్తుంటే కేవలం ఇది ప్రజలకు సమాధానం చెప్పలేకనే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి చేసిన తప్పులు బయటపడతాయనే ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేస్తూ ప్రజల మధ్యకు రాకుండా ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకుంటున్నాడు.
కావున వెంటనే ప్రశాంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలి. కృతజ్ఞతలతో మానాల మోహన్ రెడ్డి అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ నిజామాబాద్ చైర్మన్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్
