HomeCRIMEగాంధారి మండలంలో .. దొంగ నోట్ల కలకలం

గాంధారి మండలంలో .. దొంగ నోట్ల కలకలం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండా భోగ్ భండార్ జాతరలో 500 రూపాయల దొంగ నోట్ల చలామణి జరగడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చద్మల్ తండా లో లక్ష్మమ్మ ఆలయం వద్ద భోగ్ బండార్ జాతర తండా వాసులు ఘనంగా నిర్వహిస్తారు.

జాతర నిర్వహణ అనంతరం ఆలయంలోని భక్తులు సమర్పించిన హుండీ లెక్కింపు చేయగా 1.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.

హుండీ లో సమర్పించిన 500 రూపాయల నోట్లలో దొంగ నోట్లు వచ్చినట్లు గుర్తించిన గ్రామస్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పోలీసులు చద్మల్ తండా కు చేరుకొని విచారణ చేపట్టారు.

హుండీ లో ఏ ఏ నోట్లు దొంగ నోట్లు వచ్చాయనే కోణం లో పోలీసులు విచారన చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments