HomePOLITICAL NEWSUncategorizedకొలిక్కి వచ్చిన మహిళా సజీవ దహన కేసు హత్య కు గురైంది బోధన్ మహిళా ?

కొలిక్కి వచ్చిన మహిళా సజీవ దహన కేసు హత్య కు గురైంది బోధన్ మహిళా ?

ఈనెల 25న మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునీరాబాద్ శివారు లో గుర్తుతెలియని మహిళ ను సజీవ దహనం చేసిన ఘటన లో దర్యాప్తు కొలిక్కి వచ్చింది. మృతురాలు ది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ గా వెల్లడైంది.

ఆమె ఆనవాలు ఆధారంగానే కేసు దర్యాప్తు ను కొలిక్కి తెచ్చారు.మేడ్చల్ శివారు లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి గొంతు నులిమి ఆపై మృతదేహం మీద పెట్రోల్ పోసి కాల్చేశాడు.

కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసారు మొదట మృతురాలు ఎవరనేది దర్యాప్తు చేసారు , ఆమెను నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన శివనందగాఅలియాస్ ఉషా గుర్తించారు.

ఆమె సెల్ ఫోన్ ఆధారంగా నే నిందితుడి గుర్తించారు. శివనంద బతుకుదెరువు కోసం బోధన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి, ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ పలు కాలనీల్లో ఇళ్లలో పని చేస్తూ జీవనం కొనసాగించేది.

అతనే ఈనెల 25న ఆమె ను శివారు ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.ఈ మేరకు వరంగల్ లో ఉన్న నిందితుడి ని అదుపులోకి తీసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments