అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం,పటికని ను రైలులో పట్టుకున్నట్లు రైల్వే పోలిసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే..నాందేడ్ – సంబల్పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జనరల్ కోచ్ లలో సీట్ల కింద పెట్టిన 950 కిలోల బరువున్న 19 నల్ల బెల్లం సంచులు, 175 కిలోల బరువున్న పటిక స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
నల్లబెల్లం విలువ రూ.3.80లక్షలు, పటిక విలువ రూ.11,900 ఉంటుందని తెలిపారు. సంచులు ఎవరు తరలిస్తున్నారని, వారి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. వాటిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ఆర్పీఎఫ్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు.
