లారీ ఢీ కొని హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. ఈ ఘటనా నగరంలోని బైపాస్ రోడ్డు లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే. నిజామాబాద్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్ (45). డిచ్ పల్లి లోని 7 వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ మేరకు బుదవారం రాత్రి విధులు నిమిత్తం నిజామాబాద్ నుంచి డిచ్ పల్లి వైపు వెళ్తున్నా సమయంలో బైపాస్ రోడ్డు లో వెనక నుంచి లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ ఆరీఫ్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
