HomeTelanganaNizamabadఅధికార పార్టీలో దుమారం రేపుతున్న ఆ ఎమ్మెల్యేల భేటీ ......ఆ మంత్రే టార్గెట్ ..........దిద్దుబాటు చర్యల్లో...

అధికార పార్టీలో దుమారం రేపుతున్న ఆ ఎమ్మెల్యేల భేటీ ……ఆ మంత్రే టార్గెట్ ……….దిద్దుబాటు చర్యల్లో సీఎం రేవంత్ రెడ్డి? …….భేటీ జరిగిందని స్పష్టం చేసిన అనిరుద్ రెడ్డి ….

ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట ఎమ్మెల్యే లు రహస్యంగా భేటీ కావడం అధికార పార్టీ ని కుదిపేస్తోంది. ఓ మంత్రి ని లక్ష్యంగా చేసుకొనే కొందరు ఎమ్మెల్యే లు ఈ సమావేశం జరిపారని పార్టీ వర్గాల్లో విసృతంగా ప్రచారం జరుగుతుంది. విషయం తెలిసి స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతుంది. మరో వైపు పీసీసీ చీఫ్ మహేష్ సైతం ఒకరిద్దరు ఎమ్మెల్యే లను ఫోన్ లోనే సంప్రదించి అరా తీశారు.అధిష్టానం సైతం భేటీ కి దారి తీసిన పరిస్థితులను వాకబు చేస్తుంది.భేటీ లో పాల్గొన్నారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే ల్లో కొందరు ఎలాంటి సమావేశాలకు వెళ్లలేదని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా.. ఈ వ్యవహారంపై స్పందించారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యేలం సమావేశం అయిన మాట వాస్తవమే. నేను ఏ ఫైల్‌ను రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు. కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు అసలు అది ఏ ఫైల్ అనేది నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి చెప్పాలి. నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఒకచోట కలిసి మాట్లాడుకుంటే తప్పేంటి. మేమేం రహస్యంగా సమావేశం కాలేదు. క. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడుతా, అన్ని వివరాలు చెబుతా. నా క్యారెక్టర్‌ను తప్పుగా చూపిస్తే ఊరుకునేదే లేదన్నారు. ఎమ్మెల్యే భేటీ జరిగిందని అనిరుద్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పడంతో అధికార పార్టీలో ఈ భేటీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ననే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments