తెలంగాణ జనాభాలో బీసీజనాభా ఎంతో లెక్క తేలింది. రేవంత్ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే సత్పలితం ఇచ్చింది. తెలంగాణలో బిసి సామజిక వర్గం ఎంత ఉందొ ఈ సర్వే తేల్చేసింది.
మొత్తం జనాభాలో బిసి లు 55.85శాతం ఉన్నారని కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42 శాతం హిందూ మతానికి చెందిన బీసీలు, 13.85 శాతం మంది మైనారిటీ వర్గాల్లో ఉన్నారని స్పష్టం చేసింది..1450-1500పేజీలతో సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది ప్లానింగ్ కమిషన్. స్థానిక ఎన్నికలను నిర్వహించాలని పట్టుదలతో ఉన్న సర్కార్ ఆ లోపే .
బీసీ రిజర్వేషన్ల అమలు ఫై స్పష్టత ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ తీర్మానం కు కట్టుబడే ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కులగణన రిపోర్ట్ ను క్యాబినెట్ సబ్ కమిటి కి ఆదివారం చేరింది.
ఈ నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో చర్చ జరుగుతుంది. ఆతర్వాత ఫిబ్రవరి 5న జరిగే రాష్ట్ర కేబినెట్లో మంత్రులతో చర్చించి ఆమోదిస్తారు.
అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై . బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి ప్రభుత్వంసిద్ధం అవుతుంది
