HomeCRIMEన్యాక్ గుర్తింపు లోనూ ...కాసుల దందా నే ......నిజామాబాద్ లోనూ న్యాక్ కాసులమాయ .........అడ్డగోలు గా...

న్యాక్ గుర్తింపు లోనూ …కాసుల దందా నే ……నిజామాబాద్ లోనూ న్యాక్ కాసులమాయ ………అడ్డగోలు గా గుర్తింపులు ……….జిల్లాలోనూ దాడుల గుబులు

విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు కొలబద్ద గా చెప్పే న్యాక్ (నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) గుర్తింపు ల మాటున సాగిస్తున్న కాసుల దందా ను సీబీఐ ఎట్టకేలకు బట్టబయలు చేసింది.

దేశవ్యాప్తంగా న్యాక్ గుర్తింపు పొందిన పలు విద్యాసంస్థల్లో సీబీఐ మెరుపు దాడులుచేసింది.దాడుల వణుకు జిల్లాలో ను మొదలయ్యింది.దొడ్డి దారిలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో గుబులు మొదలయ్యింది.

ఏకకాలంలో 20 విద్యాసంస్థల్లో సోదాలుచేసింది. గుంటూరులోని కేఎల్‌ వర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు న్యాక్ రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చిన ఆరోపణల మీద 14 మందిపై ఎఫ్‌ఐఆర్‌, నమోదు చేసింది.

10 మంది అరెస్ట్చేశారు న్యాక్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌ చైర్మన్‌ సమరేంద్ర సహా..మాజీ డిప్యూటీ అడ్వైజర్‌ మంజునాథరావు, అడ్వైజర్ శ్యామ్ సుందర్, డైరెక్టర్ హనుమంతప్పతో పాటు విద్యాసంస్థల పెద్దలను సైతం బొక్కలో వేసింది.

మొదటి సారి న్యాక్ గుర్తింపుల మాటున సాగుతున్న వసూళ్ల దందా గుట్టు రట్టు అయింది. నిజానికి న్యాక్ గుర్తింపు వచ్చిందంటే ఆ విద్యాసంస్థ ఖ్యాతి కి గీటు రాయి గా భావిస్తారు. దేశంలో ప్రైవేట్, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కార్పొరేట్ తో పాటు అనేక బడా విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపు కోసం తహతహా లాడుతుంటాయి.

ఇందుకోసం న్యాక్ నిర్దేశించిన నియమాలు నాణ్యత ప్రమాణాలు సైతం అంతే కఠినంగా వుంటాయి.అందుకే ఖ్యాతి పొందిన బడా విద్యా సంస్థలే న్యాక్ గుర్తింపు జోలికి వెళ్లడానికే ఆసక్తి చూపవు.

కఠిన మైన ఆంక్షలను సైతం కాసుల ఎర తో అధిగమించి నిజామాబాద్ జిల్లాలోను కొన్ని విద్యాసంస్థలు న్యాక్ అక్రిడేషన్ సాధించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments