ఈ ఘటనలో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి గాయపడ్డారు. ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుండి రెండు తుపాకీలు, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బత్తుల ప్రభాకర్ చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందినవాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2022లో విశాఖపట్నం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించిన ప్రభాకర్, 2023 నవంబర్ నుండి పరారీలో ఉన్నాడు.
కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ మాట్లాడుతూ, నిందితుడిపై రాబరీ కేసులు ఉన్నాయని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు
