నిజామాబాద్ నగరంలో అల్లరి మూకల ఆగడాలు ఆగడం లేదు. పాల ప్యాకెట్ విషయంలో తలెత్తిన వివాదం లో నలుగురు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు.
ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇంటి సమీపంలో బేకరీ కి పాల ప్యాకెట్ కోసం వెళ్లి ధర విషయంలో బేకరీ ఓనర్ తో వాదన కు దిగుతాడు. అంతటి తో ఆగకుండా మరుసటి రోజు నలుగురు స్నేహితులతో కలిసి బేకరీ కి వచ్చి కత్తులతో బాహాటంగా వీరంగం చేసారు.
కౌంటర్ లో ఉన్న ఓనర్ మీద కత్తులతో బెదిరించారు. అడ్డం వచ్చిన వారిని సైతం చితకబాదారు బాధితులు ఆరో టౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు
