అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏబీవీపీ ఆఫీస్ లో బహుమతుల ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి డాక్టర్ ధన్పాల్ వినయ్ కుమార్ గారు ముఖ్య వక్త ప్రాంత సంఘటన మంత్రి శ్రీ లవన్ కుమార్ గారు హాజరయ్యారు
విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అని విద్యార్థుల్లో దేశభక్తి వ్యక్తి నిర్మా ణము వంటి ముఖ్యమైన అలవాట్లను నేర్పిస్తుoదని విద్యార్థి పరిషత్ లో పనిచేసే కార్యకర్త భవిష్యత్తులో సమాజం పట్ల బాధ్యతను దేశం పట్ల అభిమానాన్ని పెంచుకుంటాడని అన్నారు
అంతే కాకుండా విద్యార్థులు సెల్ఫోన్లో వాడకం తగ్గించి మైదానంలో ఆటలు ఆడాలని శారీరక వికాసం కలగాలని శరీరం దృఢంగా ఉంటేనే మనస్సు దృఢంగా ఉంటుందనిమనస్సుద్రుడంగా ఉంటేనే మన ఆలోచనలు దృఢంగా ఉంటాయని తెలిపారు వివేకానంద నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మార్గంలో విద్యార్థి పరిషత్ పని చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ ప్రముఖ రెంజల్రా నరేష్ గారు విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి శివకుమార్ జిల్లా కన్వీనర్ దర్శనం ప్రవీణ్ నగర అధ్యక్షులు వెంకటకృష్ణ గారు దుర్గా దాస్ కునాల్ ఓంకార్ శ్రీశాంత్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










