HomeTelanganaNizamabadపేదల్లో రేషన్ ఆశలు .....కొత్త కార్డు ల కొసం ఎదురు చూపులు ........దరకాస్తు చేయడానికి మీ...

పేదల్లో రేషన్ ఆశలు …..కొత్త కార్డు ల కొసం ఎదురు చూపులు ……..దరకాస్తు చేయడానికి మీ సేవల వద్ద బారులు .. ……మొరాయిస్తున్న సర్వర్లు ….అప్లికేషన్ స్క్రూటినీ ఎప్పుడో

అర్హులైన పేదల్లో మరోసారి రేషన్ కార్డు ఆశలు చిగురించాయి. బుధవారం నుంచి మరోసారి రేషన్ కార్డు ల కోసం దరఖాస్తులు తీసుకునే పక్రియ మొదలయ్యింది.మొదటి రోజు సర్వర్లు మొరాయిస్తున్న సరే ఆన్ లైన్ దరఖాస్తులు చేయడానికి ప్రజలు మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు.

అయితే తాజా మార్గదర్శకాల్లో గందరగోళం నెలకొంది. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డు ల మంజూరి కి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇదివరకే గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకున్నా సరే అర్హుల్లో ఆందోళన వ్యక్తం అయింది దీనితో మరోసారి దరఖాస్తు పక్రియ కు శ్రీకారం చుట్టింది.

కానీ సర్వర్లు మొరాయిస్తుండడం తో రేషన్ కార్డు ల దరఖాస్తుల పక్రియ కు మొదటి రోజే విఘాతం కలిగింది . దీనితో దరఖాస్తు చేయడానికి వచ్చి మీసేవ కేంద్రాల వద్దే బారులు తీరారు. సర్వర్ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుందో చెప్పే వారే లేకుండా పోయారు.

అర్హులైన పేదలకు రేషన్ కార్డు లు ఇవ్వడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే వేలాది మంది కొత్త రేషన్ కార్డు లు ఎప్పడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలకు అర్హులైన అనేక మంది అందుకోలేక పోతున్నారు అందుకే కొత్త రేషన్ కార్డుల కోసం దరకాస్తు ల పక్రియ ఆసక్తి ఉండే. ఇటీవల నిర్వహించిన గ్రామ సభ ల్లోనూ రేషన్ కార్డు కోసం దరఖాస్తులు వెలువెత్తాయి.

ఈ నేసథ్యంలో మరోసారి రేషన్ కార్డు ల కోసం ప్రభుత్వం మరోసారి దరఖాస్తుల పక్రియ కు తెరలేపింది.ఇటీవల గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులఫై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజా మరోసారి దరఖాస్తులను ఈసారి ఏకంగా ఆన్ లైన్ పక్రియ లో స్వీకరించింది.

కానీ మొదటి రోజే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ మేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమారు పదేళ్లుగా నూతన రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది.

రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, మార్పులు, చేర్సులు చేస్తామని, మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేయడానికి అనేక మంది శనివారం ఉదయమే మీసేవ కేంద్రాలకు పరుగులు పెట్టారు పౌర సరఫరాల శాఖ కు చెందిన పోర్టల్ ఉదయం నుంచే మొరాయించింది.

కానీ కొత్త రేషన్ కార్డులు మీసేవ ద్వారా తీసుకోవడం లేదంటూ కింది స్థాయి సిబ్బంది సమాచారం అందడంతో అప్లికేషన్ల స్వీకరణ పక్రియ నిలిచిపోయింది. ప్రజాపాలన, ప్రజావాణి అప్లికేషన్‌ల డేటా ఎంట్రీపై వివరణాత్మక సూచనలు త్వరలో జారీ చేస్తామని, అందరూ డీసీఎస్‌వోలు ఈ ఆదేశాలను కింది స్థాయి సిబ్బందికి తెలపాలని వారికి వాట్సాప్ మెసేజ్‌లు అందాయి.

కానీ సంబంధిత అధికారులెవ్వరు మీసేవ నిర్వాహుకులకు ఈ విషయాలేవీ స్పష్టం చేయక పోవడంతో గందోరగోళం తలెత్తింది. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసిన రశీదు లను స్థానిక పౌర సరఫరా శాఖ కార్యాలయంలో ఇవ్వాలని పేర్కొనడం తో దరఖాస్తు చేసిన వారు ఆ రశీదు లను తీసుకోని నగర శివారు లోని పౌర సరఫరా కార్యాలయం కు వెళ్తున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments