HomeLaw and Orderజేసీఐ ఇందూర్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం రాత్రి నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్...

జేసీఐ ఇందూర్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం రాత్రి నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్ లో అట్టహాసంగా జరిగింది.

2025 సంవత్సరానికి గానూ జేసీఐ ఇందూర్ నూతన అద్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెందోటి గౌతమి ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేశారు..జేసీఐ ఇందూర్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బాన్ని పురస్కరించుకొని రజతోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థ పూర్వాద్యక్షులను సన్మానించారు..

ఈ కార్యక్రమానికి జేసిఐ ఇండియా 12 వ జోన్ అధ్యక్షుడు వి.చతుర్వేది ముఖ్యాతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీఐ ఇందూర్ 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు..

జేసీఐని ముందుకు తీసుకెళ్తున్న పూర్వాద్యక్షులను, సభ్యులను ఆయన అభినందించారు.జేసీఐ సేవలను మరింత విస్తరించాలన్నారు..

కార్యక్రమంలో తహసిల్దార్ ఎల్.వీర్ సింగ్,జేసీఐ ఇండియా నేషనల్ డైరెక్టర్ బి.కిరణ్ జోన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.దిలీప్,జేసీఐ ఇందూర్ పూర్వాద్యక్షులు జిల్కర్ విజయానంద్,వీరబ్రహ్మం,ఎం.శ్రీనివాస్, ,పద్మ శ్రీనివాస్,దండు గోవర్దన్,కె.చంద్రశేఖర్,జుగల్ కిషోర్ సోని,పూర్ణచందర్,శ్రీహరి,యాదేష్,పి.చంద్రశేఖర్,మనోజ్ కుమార్, వెంకటరమణ గౌడ్,వి.శ్రీనివాస్ రెడ్డి,
నయన్, గంగాదాస్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments