నిజాంసాగర్ మండలం బూర్గుల్ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర తిమ్మయ్య (45) మృతదేహం గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో కనిపించింది.
వివరాలు సమాచారం మేరకు, ఆజామాబాద్ గ్రామానికి చెందిన ఓ మహిళతో తిమ్మయ్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం, ఆ మహిళతో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి మద్యం సేవించినట్లు సమాచారం.
అయితే, గురువారం ఉదయం అతను మృతి చెంది ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్, పిట్లం ఎస్సై రాజు, బీర్కూరు ఎస్సై రాజశేఖర్.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుడి కుమారుడు యేసుప్రభు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద కోణాలు- తిమ్మయ్య మద్యం మత్తులోనే మృతి చెందాడా? – లేక ఈ ఘటన వెనుక మరేదైనా కుట్ర ఉందా? అతని మృతికి వివాహేతర సంబంధం ఏమైనా కారణమా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు పోస్టుమార్టం నివేదికతో పాటు, పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఈ కేసు మరింత మలుపులు తిరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
