HomeCRIMEచేపలు పట్టడానికి వెళ్లి బాలుడు మృతి..

చేపలు పట్టడానికి వెళ్లి బాలుడు మృతి..

చేపలు పట్టడానికి వెళ్లి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన పోతంగల్ మండలం లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పోతంగల్ మంజీరా నదిలో బుధవారం మధ్యాహ్నం సాయిరాం (17 ) చేపలు పట్టడిని వెళ్ళాడు.

ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో మంజీరా కు వెళ్లి కుటుంబీకులు వెతిక సాగారు. అక్కడే బట్టలు , చెప్పులు కనబడడంతో, ఇవి మా పిల్లాడి అని గుర్తించి, ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోతంగల్ మంజీరా వద్ద జాలర్లు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి మృత దేహాన్ని బయటకు తీశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments