కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తీ అయిన నేపథ్యంలో ఇక కార్యక్షేత్రంలో దిగడానికి గులాబీ పార్టీ సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళలో పార్టీ నేతలకు ఆయనే స్వయంగా దిశానిర్దేశం చేయబోతున్నారు.
ఈనెల 19న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశానికి సంబంధించిన ఉత్తర్వ్యూలు జారీచేశారు కార్యచరణపై ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనుండగా..
పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరు కానున్నట్టు కేటీఆర్ తెలియజేశారు. కాగా ఈ సమావేశంలో..
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నామని కెటిఆర్ తెలిపారు.
