ఆలూరు మండలంలోని వెంకటేశ్వర గుట్ట వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ముత్తెన్న అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక, మద్యం మత్తులో కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముత్తెన్న ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అయితే, గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వెంకటేశ్వర గుట్ట సమీపంలోని కుంటలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
