యజమాని దుబాయ్ వెళ్లడాన్ని అవకాశంగా భావించిన పనివాళ్లు.. అదే అదునుగా ఇంట్లో ఉన్న రూ . 5 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, నగదు,తీసుకోని పరార్ అయ్యారు.
కానీ నగర పోలీసులు ఈ ఘరానా దొంగల అట కట్టించారు.చోరీ చేసి సొత్తు తో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు లో పారిపోతుండగా నాగ్ పూర్ వద్ద పట్టుకున్నారు కమిషనర్ సివి ఆనంద్ ఈ వివరాలు తెలిపారు హైదరాబాద్ నారాయణ గూడ ప్రాంతానికి చెందిన ..
రోహిత్ కేడియా అనే వ్యాపారి కుమార్తె పెళ్లి కోసం దుబాయ్ కి వెళ్లారువచ్చే దాక ఇళ్లు జాగ్రత్త చూసుకోవాలని పని వాళ్ళు కు చెప్పి వెళ్ళాడు .ఈ క్రమంలో ఫిబ్రవరి 11న ఇంట్లో పనిచేసే మొల్హూ ముఖియా, సుషీల్, బాసంతి, ఆరిలు కేడియా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు వజ్రాలు విదేశ కరెన్సీ లను ఎత్తుకెళ్లారు పెళ్లికి వెళ్లిన సమయంలో చోరికి పాల్పడ్డారు.
కేడియా దుబాయి నుంచి రాగానే ఇంట్లో విలువైన నగలు నగదు చోరీ అయినట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు పిర్యాదు చేసారు వెంటనే 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
నిందితుల్లో మొల్హూ ముఖియా గతంలో దోమలగూడ పరిధిలో వృద్దురాలి పై దాడి చేసి కోటి రూపాయలు దొంగిలించిన కేసులోను ప్రధాన నిందితుడు. అయితే నిందితులు లొకేషన్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో లభించింది దీనితో రైలు వెళ్లే మార్గంలో రేల్వే పోలీసులను అప్రమత్తం చేశారు
ఈ చోరీ కేసు ను 24 గంటల్లో ఛేదించిన ఈస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందిస్తున్నామని సీపీ ఆనంద్ తెలిపారు..నిందితులు చోరీ చేసి తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా నాగ్ పూర్ లో పట్టుబడ్డారు.
నాగ్ పూర్ రైల్వే పోలీసుల సహకారంతో హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు రైలులో తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
