సదాశివనగర్ తెల్లవారుజామున సదాశివనగర్ మండలం గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
కారు అదుపుతప్పి బోల్తాపడడంతో గంగాధర్ అనే వ్యక్తి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. అతని కూతురు లహరి తలకు తీవ్ర గాయాలవడంతో వెంటనే హైదరాబాద్కు తరలించారు.
స్థానికుల వివరాల ప్రకారం, గంగాధర్ ఇటీవలే విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. కూతురు లహరిని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తీసుకువెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
