శివపురాణం లో లేకపోవచ్చు కానీ శివ లీలలు అనేకం ఉన్నాయి. అలాంటిదే ఈ చిన్న కథా .! ఇంద్రుడికి ఇచ్చిన మాట మేరకు శివుడు ఢమురుకం కు దూరంగా వుండడం రైతుల కుఓ శాపం లా మారింది. వర్షాలు లేక విల విలా లాడిపోయేలా చేసింది. చివరికి పార్వతి ఉపాయం ప్రకృతి పరవశించేలా చేసింది.
మీద ఒకసారి ఇంద్రుడికి రైతుల మీద బాగా కోపం వచ్చింది… ప్రతియేటా వర్షాలు కురవడం ఏ మాత్రం ఆలస్యమైనా, లేదంటే అవసరాలమేరకు వర్షలు పడక పోయినా సరే వరుణదేవుడిని వదిలేసి తనను తిడుతున్నారనేది ఇంద్రుడి కోపానికి కారణం దాంతో ఆయనకు కోపం వచ్చింది భీకర ప్రకటన జారీ చేశాడు…
‘మీకు నా విలువ అర్థం కావాలి, అందుకని పన్నెండేళ్లపాటు అసలు ఒక్క చుక్క కూడా కురిపించను’ అనేది ఆ ప్రకటన సారాంశం‘అయ్యో, అయ్యో,పంటలు ఎలా పండుతాయి తినడానికి ఎలా సచ్చిపోతాం, దయచూపించు తండ్రీ’ అని రైతులు మొరపెట్టుకున్నారు…
దాంతో తెలివిగా ‘అందరి దేవుడూ శివుడు కదా, తను ఢమరుకం మోగించినప్పుడు మాత్రమే వర్షాలు కురిపిస్తాను’ అని మెలిక పెడుతాడు.కానీ ఆ రైతులు శివుడికి మొరపెట్టుకునేలోపు, ఇంద్రుడే వేగంగా వెళ్లి శివుడి దగ్గర మోకరిల్లి, తాను రైతుల విషయంలో ఇలా ప్రకటన చేశాను, పన్నెండేళ్లపాటు ఢమరుకం మోగించకుండా నా పరువు పోకుండా కాపాడు స్వామీ’ అన్నాడు…
లేదంటే ఇంద్రుడంటే విలువ వుండదు స్వామి అని వేడుకుంటాడు .శివుడు అలాగే అన్నాడు… పన్నెండేళ్లపాటు ఢమరుకం చేతపట్టను మోగించాను అని ఇంద్రుడికిమాట ఇచ్చాడు…ఇంకేముంది..? విషయం తెల్సి దిక్కుతోచని రైతులు ఇక నిరాశగా వెనుదిరుగుతారు.
వర్షాల కోసం పన్నెండేళ్లపాటు నిరీక్షించడానికే నిర్ణయించుకున్నారు…కానీ ఒక్క రైతు మాత్రం ఎప్పటిలాగే తన పొలం పనులు చేస్తూనే ఉన్నాడు… దున్నుతున్నాడు, విత్తనాలు వేస్తున్నాడు…
ఎరువులు వేస్తున్నాడు…అవన్నీ చూస్తున్న మిగితా రైతులు ఆయన్ని తిట్టి పోస్తున్నారు తమాషాగా ఉందా, పిచ్చా..? మూడేళ్లుగా చూస్తున్నాం, వర్షాలే లేవు వేస్తున్న విత్తనాలు ఎండిపోతున్నాయి ప్రయోజనం లేదని తెలిసీ ఎందుకు కాయ కష్టం చేస్తున్నావు , కాలం వృథా, శక్తి వృథా కదా అనడిగారు, కొందరు ఎద్దేవా చేశారు,వర్షాలు ఉండవని తెల్సు కదా ?అంటూ దెప్పిపొడిచారు అందుకు ఆ రైతు నవ్వి ‘నాకు తెలుసు, వర్షాలు రావని ఇప్పుడు చేసే పనితో వచ్చేదేమీ లేదని మీ అందరిలాగే నాకూ తెలుసు…
కానీ పన్నెండేళ్లు వ్యవసాయ పని మానేస్తే అసలు పొలం పని ఎలా చేయాలో మరిచిపోతానేమో…పన్నెండేళ్ల తర్వాత వర్షాలు పడ్డా పనులు చేయలేక పొతే ఎలా ? అందుకే ఇలా చేస్తున్నాను’ అని బదులిచ్చి ఆ రైతు … పనిలో మునిగిపోయాడు…ఇదంతా ఆసక్తిగా వింటున్న పార్వతికి ఆరైతు మీద జాలి కలిగింది…
రైతుల మీద ఇంద్రుడి భీషణ ప్రకటనలో న్యాయం లేదని తోచింది… కానీ శివుడు ఇంద్రుడికి మాట ఇచ్చాడాయె… శివుడి ద్వారానే రైతుల్ని ఆదుకోవాలి, భక్తసులభుడు, భోళాశంకరుడు కదా తరువాత తనే అర్థం చేసుకుంటాడు అనుకుంది…ఆ అమ్మవారు !రైతు ఏమన్నాడో చెప్పింది శివుడికి…
‘నాకూ సందేహమొస్తోంది… పన్నెండేళ్ల తరువాత అసలు ఢమరుకం ఎలా మోగించాలో కూడా నీవూ మరిచిపోతావేమో… ఏమో, ఇప్పటికే మరిచిపోయి ఉంటావు’ అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది . ఒక్కసారిగా శివుడూ ఆలోచనలో పడిపోయాడు ‘ఎంత మాట..? ఎంత మాట..? ఇదుగో చూడు, అంటూ వెంటనే ఢమరుకం తీసుకుని మోగించాడు…
దాంతో వెంటనే మేఘాలు అప్రమత్తమై ‘శివుడాజ్ఞ అయ్యింది కదా’ అనుకుని వరుణుడు భోరున వర్షించాడు. ఇప్పటిదాకా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఆ రైతు వెంటనే వర్షానంతర పొలం పనుల్లో బిజీ అయిపోయాడు… నాలుగు రోజులకే పంట ఏపుగా పెరిగింది…
అప్పుడు హడావుడిగా కళ్లుతెరిచిన ఇతర రైతులు పొలాల వైపు పరుగులు తీశారు…యధావిధిగా తమ పొలం పనుల్లో పడిపోయారు ………..
( ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా )
