మద్యం వ్యాపారంలో కొనసాగుతున్న సుదర్శన్ రెడ్డి సొంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని అందుకే యన్ యస్ యఫ్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ఆసక్తి చూపిస్తలేరని ఎంపీ అర్వింద్ ధ్వజమెత్తారు.
ఆయన శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ప్రతి అధికారిని, నాయకులు, కార్యకర్తలను, సాధారణ ప్రజలను మతం పేరుతో తిట్టడమే సుదర్శన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారనీ ఆరోపణచేశారు. కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలతో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. .
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేస్తే నిజామాబాద్ పార్లమెంట్ కు రెండు నవోదయ విద్యాలయాలు తీసుకొచామని తెలిపారు. జిల్లా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో జక్రాన్ పల్లి మండలం కలిగోట్ వద్ద నవోదయ ఏర్పాటు చేయాలని దానికి తమ పార్టీ ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి ఒప్పించి మంజూరు చేయించమని పేర్కొన్నారు.
ఈ విషయం పై తాము సిఎం రేవంత్ రెడ్డి కలిసి అందుకు సంబంధించిన స్థలం కోసం మాట్లాడినామని,దానికి సిఎం వెంటనే స్థలానికి అనుమతులు ఇవ్వాలని ఆదేశాల కూడా జారీ చేశారు. అయితే రూరల్ నియోజకవర్గంలో విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలం కూడా చూపించారన్నారు.
కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వివాదాల్లో ఉన్న ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూములను చూపించి విద్యాలయాన్ని అడ్డుకున్నారన్నారు. సుదర్శన్ రెడ్డి కావాలనే ఈ స్థలం చూపించి నదోదయను జిల్లాకు రాకుండా చేశారని ద్వజమెత్తారు.
దీంతో ఇక సుదర్శన్ రెడ్డి బోధన్ సుగర్ ఫ్యాక్టరీ తెరిపించే ఆలోచనలో లేరని,దీనిపై రైతులు ఆలోచన చేయాలని కోరారు. క జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు పై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడనని దానికి సర్వే చేసి ఎల్ఓసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ఎన్ని మార్లు తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాగో పనులు చేయరు, కనీసం చేయాల్సిన పనులు తానే చేస్తున్నా అడ్డు పడుతున్నారని దుయ్యబ్టారు.
