HomeTelanganaNizamabadమొరాయిస్తున్న సర్వర్లు .......మొదలైన యల్ ఆర్ యస్ ...... విస్తృతంగా ప్రచారం చేస్తున్న అధికారులు .........అయిదేళ్ల...

మొరాయిస్తున్న సర్వర్లు …….మొదలైన యల్ ఆర్ యస్ …… విస్తృతంగా ప్రచారం చేస్తున్న అధికారులు ………అయిదేళ్ల నాటి దరఖాస్తులకు మోక్షం

నాన్ లే అవుట్ ఏరియా లో ఇండ్ల స్థలాలను క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. చాల కాలంగా ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి.

కానీ మొదటి రోజే ఈ పక్రియ కు సాంకేతిక అడ్డంకులు తలెత్తాయి. ల్యాండ్‌‌ రెగ్యులరైజేషన్‌‌ స్కీమ్‌‌లో తమ ప్లాట్ లను క్రమబద్దీకరించుకోవడానికి ఈ మర్చి 31 వరకే గడువు ఇచ్చింది.

ఈ స్కీమ్ లో తమకు అవకాశం ఇవ్వాలని 2020 లో దరఖాస్తు లు చేసిన వారికే సర్కార్ అవకాశం ఇచ్చింది. అందులోనూ మొత్తం పీజు ఒకే సారి చెల్లించే వారికి ఏకంగా 25 శాతం రాయితీ ఇచ్చేసింది.

దీనితో దరఖాస్తు దారులు తమ ప్లాట్ క్లియర్ చేసుకోవడానికి ఆసక్తి చూపారు. మొదటి రోజే మున్సిపల్ కార్యాలయాలకు బారులు తీరారు. తీరా మొదటి రోజే సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.ముఖ్యంగా పీజు చెల్లింపు ల్లో ఇబ్బందులు వచ్చాయి దీనితో చాల మంది వెనక్కి తగ్గారు .

రిజిస్టర్డ్‌‌ ఫోన్‌‌ నంబర్‌‌తో లాగిన్‌‌ అయ్యాక ఫీ పేమెంట్‌‌ ఆప్షన్‌‌పై క్లిక్‌‌ చేయగానే ‘సర్వర్‌‌ ఎర్రర్’ అని వస్తోంది. పలుమార్లు ప్రయత్నిస్తే గానీ అప్లికేషన్‌‌ నంబర్‌‌, పేమెంట్‌‌ చేయాల్సిన చార్జీల వివరాలు కనిపించడం లేదు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ స్కీమ్ తో భారీగా ఆర్థిక లబ్ది పొందాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం పెండింగ్ దరఖాస్తులను ఎలాగైనా క్లియర్ చేయాలంటూ మున్సిపల్ యంత్రాంగం ను పురమాయించింది. అందుకే మున్సిపల్‌‌ కార్పొరేషన్ ఆఫీసర్లు విస్తృతంగా ప్రచారం చేస్త్నునారు.

దరఖాస్తుదారుల సెల్‌‌ నంబర్లకు అప్లికేషన్‌‌ వివరాలతో మెసేజ్‌‌లు సైతం పంపుతున్నారు.రాష్ట్రంలోని లక్షలాది మంది దరఖాస్తుదారులు పోర్టల్‌‌ ఓపెన్‌‌ చేస్తున్నారు. ఒకే సారి ఎక్కువ మంది పోర్టల్‌‌ను ఓపెన్‌‌ చేస్తుండడంతో సర్వర్‌‌ ఎర్రర్ అని చూపిస్తోంది.

ఎల్ ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకుపైగా అప్లికేషన్లు రాగా ఇందులో సుమారు 9 లక్షల దరఖాస్తులనే పరిష్కరించారు. జీవో నెంబర్ 135 ఫిబ్రవరి 20 నే ఆదేశాలు వచ్చాయి.

ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది అందుకే మార్చ్ 10నుంచి స్కిం అమల్లోకి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు.

రెగ్యులరైజేషన్ వెయ్యి రూపాయలు కట్టిన ఒరిజినల్ రశీదు మీ దగ్గర ఉన్న ఫ్లాట్ ఒరిజినల్ డాక్యుమెంట్ లు ఇవ్వాలి.ఈ రెండు ఉంటే సరిపోతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments