HomeLaw and Orderకోడ్ తొలిగింది .....కొత్త కొత్వాల్ వచ్చేస్తున్నాడు .......ఈసారి కూడా డైరెక్ట్ ఐపిఎస్ .......

కోడ్ తొలిగింది …..కొత్త కొత్వాల్ వచ్చేస్తున్నాడు …….ఈసారి కూడా డైరెక్ట్ ఐపిఎస్ …….

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తేసిన మరుసటి రోజే నిజామాబాద్ పోలీసు కమిషనర్ నియామకఉత్తర్వ్యూలు వచ్చేసాయి. ఈసారి కూడా ప్రభుత్వం డైరెక్ట్ ఐపిఎస్ నే కమిషనర్ గా నియమించడం గమనార్హం మాజీ మంత్రు సుదర్శన్ రెడ్డి చెప్పినట్టు గానే గట్టి అధికారిగా పేరున్న పోతూ రాజు సాయి చైతన్య ను సీపీ గా నియామకం అయ్యారు.

నాన్ క్యాడర్ ఐపిఎస్ ల ఏలుబడి లో జిల్లాలో పోలీసింగ్ పూర్తిగా అదుపు తప్పింది. అసెంబ్లీ ఎన్నికల కు ముందు వచ్చిన కల్మేశ్వర్ కొంత మేరకు కాయకల్ప చికిత్స చేశారు. కానీ ఆయన ఏడాది లోపే బదిలీ కావడంతో మళ్ళీ మొదటి కి వచ్చింది.

కొత్త సీపీ నియామకం లో ప్రభుత్వం పెద్దల్లో పెద్దఎత్తున కసరత్తులు జరిగాయి. అధికార పార్టీలో ఓ వర్గం నాన్ క్యాడర్ ఐపిఎస్ ను కమిషనర్ తెచ్చుకోవాలని భావించింది. కానీ సుదర్శన్ రెడ్డి ససేమిరా అన్నారట అందుకే నియామక పక్రియ నిలిచిపోయింది. సీఎం ఎటు తేల్చుకోలేక పోయారు.

ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ వచ్చింది దీనితో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లాఎన్నికల చరిత్ర లోనే మొదటి సారిగా జిల్లాకు పోలీసు బాస్ లేకుండానే ఎన్నికల కతృవు జరిగింది. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్న కల్మేశ్వర్ గత ఏడాది అక్టోబర్ లో బదిలీ అయ్యారు.

కల్మేశ్వర్ స్థానం లో కొత్త కమిషనర్ నియామకం లో అసాధారణ జాప్యం జరిగింది .అనేక మంది పేర్లు పరిశీలన చేసి చివరికి పెండింగ్ లో పెట్టి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కు ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చింది. .

ఓ నేత నాన్ క్యాడర్ ఐపిఎస్ కావాలంటూ ఏకంగా ఇద్దరి పేర్లను సిఫారస్ చేస్తే మరో దిగ్గజ నేత మాత్రం జిల్లాలో గట్టిగా పనిచేసే డైరెక్ట్ ఐపిఎస్ నే కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వాలని పట్టు బడడం తో .

సీఎం సైతం ఈ విషయంలో ఇరకాటంలో పడ్డారట మర్చి మొదటి వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి సిద్ధం అయినా ప్రభుత్వం జనవరి లో నే కమిషనర్ నియామకం చేస్తోంది భావించారు కానీ ఆ ఎన్నికల పక్రియ వెనక్కి వెళ్ళింది కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో కమిషనర్ నియామకం పెండింగ్ లో పడింది.

ప్రభుత్వం కమిషనర్ నియామకంలో జాప్యం చేయడం పైనా విమర్శలు వెలువెత్తాయి. ఎట్టకేలకు కోడ్ తొలిగిన మరుసటి రోజే కొత్వాల్ నియామకం జరిగింది.

సాయి చైతన్య ది మధ్యతరగతి నేపథ్యం

2016 బ్యాచ్ కు చెందిన సాయి చైతన్య బనారస్ ఐఐటి లో ఇంజనీరింగ్ పూర్తీ చేసి రెండో ప్రయత్నంలోనే ఐపిఎస్ సాధించారు కాటారం లో ఏ ఎస్పీ గా ప్రస్థానం మొదలు పెట్టి కొద్దీ మాసాలకే ములుగు కు బదిలీ అయ్యారు అక్కడే రెండేళ్లు పనిచేసి తన మార్క్ చూపెట్టారు కొద్దీ రోజులు వరంగల్ ట్రాఫిక్ లో పనిచేసి హైదారాబాద్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ డీసీపీ అక్కడి గా పనిచేసారు.

ప్రస్తుత నార్కోటిక్ విభాగంలో ఎస్పీ గా పనిచేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి నేపథ్యంఉంది తల్లితండ్రులు మచిలీపట్నం కానీ తండ్రి ఉద్యోగ రీత్యా తిరుపతి నెల్లూరు ప్రాంతాల్లో సాయి చైతన్య విద్యాబ్యాసం సాగింది విజయవాడ లో ఇంటర్ పూర్తీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments