పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని పసుపు రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పసుపు మద్దతు ధర ఇస్తామన్న హామీలు ఇచ్చి నెరవేర్చలేదని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో అధికారులు ప్రకటించిన ధర దక్కకుండా వ్యాపారులు, దళారులు తమను మోసం చేస్తున్నారన్నారనీ రైతులు మండిపడ్డారు.
తమకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు.
