తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఉత్కంఠ గా మారింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న అధిష్ఠానం ఈసారి కొత్త సారథి ని ఖరారు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సామజిక సమీకరణలనే పరిగణలోకి తీసుకుంటుంది. గత నెలరోజులుగా ఇదే కార్యంలో ఢిల్లీ పెద్దలు తలమునికలై ఉన్నారు. వారం రోజుల లోపే కొత్త అధ్యక్షుడి ని తేల్చే దిశగా తుది కసరత్తులు సాగుతున్నాయి. ఈసారి ఏకంగా ముగ్గురు ఎంపీ లే అధ్యక్ష పదవీ రేసులో కి వచ్చారు ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ లు చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ లు తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. గతంలోనే బీజేపీ పగ్గాలు అడిగిన అర్వింద్ ఈసారి పట్టు బడుతున్నారు. తెలంగాణ ఆర్ ఆర్ యస్ నేతలు సైతం అర్వింద్ కు అధ్యక్ష పదవీ అప్పగిస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని చెప్తున్నారు. అదే అర్వింద్ కు ఈసారి బాగా కలిసి వస్తుంది. అలాగే బీజేపీ యల్ పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తో పాటు రఘునందన్ రావు సైతం అర్వింద్ వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల గణన తో బిసి నినాదం తెరమీదికి వచ్చింది మరో వైవు రిజర్వేషన్ వ్యవహారంలో మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టె వ్యూహంతో ఉంది. అందుకే ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బిసి కి ఇవ్వాలనే ఒత్తిడి ఢిల్లీ పెద్దల మీద ఉంది. ఈ నేపథ్యంలోనే అర్వింద్ ఈసారి తనకే అవకాశం వస్తుందనే ధీమా తో ఉన్నారు. గతంలో బి ఎల్ సంతోష్, బన్సాల్ లాంటి దిగ్గజ నేతలను జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు ఢిల్లీ కి వెళ్లి కలిశారు అర్వింద్ కు బీజేపీ పగ్గాలు ఇవ్వాలని కోరారు వారుకూడా సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తెలంగాణ నుంచి మోడీ క్యాబినెట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మంత్రులుగా ఉన్నారు వీరిలో కరీంనగర్ ఎంపీ సంజయ్ మున్నారు కాపు సామాజిక వర్గం అదే సామజిక వర్గం కు చెందిన అర్వింద్ కు బీజేపీ చీఫ్ గా ఎలా నియమిస్తారని వాదన ను కొందరు అర్వింద్ వ్యతిరేకులు ఢిల్లీపెద్దల వద్ద చేశారు. దీనితో నిరాశ కు గురై అర్వింద్ అధ్యక్ష పదవి మీద ఆశలు వదులు కున్నారు. కానీ పార్టీలో అలాంటి సామజిక కోణం మీద చర్చ వుండదని బలోపేతం చేసే సత్త ఉన్నవారికి ఖచ్చితంగా ప్రాధాన్యత వుంటుందని ఆర్ యస్ యస్ ప్రముఖులు అర్వింద్ పురమాయించడంతో ప్రయత్నాలను మరింత గట్టిగా మొదలు పెట్టారు. కీలక నేతల మద్దతు కూడగట్టారు. బిసి లకే కేటాయిస్తే అర్వింద్ కె అవకాశం ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి రఘు నందన్ రావు సైతం గట్టిగా చెప్పినట్లు సమాచారం. దీనితో అర్వింద్ కు అవకాశాలు మరింత పెరిగాయి. కాపు సామాజికంవర్గం కు చెందిన సంజయ్ ఎలాగో మంత్రిగా ఉన్నందున బీసీ లో మరో బలమైన సామజిక వర్గం నేతకు పగ్గాలు ఇస్తే ఎలా వుంటుందనే ఆలోచనతో ముదిరాజ్ కులం కు చెందిన ఈటెల రాజేందర్ పేరు తుది పరిశీలన లో చేరింది.
