నందిపేట మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ ఐఐటి కరిక్యులం పేరుతో నూతనంగా ఎస్ ఎస్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ ప్రైవేటు పాఠశాల భవన నిర్మాణాన్ని భారీ ఎత్తున షాపూర్ వెళ్లే దారిలో గరీబాబా దర్గా వద్ద చేపట్టారు..
ఈ పాఠశాల భవన నిర్మాణం పూర్తికాకున్నా అప్పుడే అడ్మిషన్స్ ప్రక్రియ మొదలెట్టారని, బిల్డింగ్ పనులే పూర్తి కాకుండా విద్యార్థులను ఎలా భర్తీ చేసుకుంటారని తక్షణమే ఈ నూతన పాఠశాలపై చర్య తీసుకోవాలంటూ జిల్లా ట్రస్మా అధ్యక్షులు రాస నిత్యానందం ఆధ్వర్యంలో ట్రస్మా కార్యవర్గ సభ్యులంతా జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్కు మెమోరండాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నందిపేట మండల ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ,…. నూతనంగా నిర్మిస్తున్న ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పూర్తి కాకుండానే వచ్చే విద్యా సంవత్సరం కొరకు అడ్మిషన్స్ ప్రక్రియను చేపట్టడం, అలాగే మండల కేంద్ర ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందినీ భర్తీ చేసుకోవడం విడ్డూరమని అన్నారు.
విద్యను అందించే హక్కు అందరికీ ఉందని కానీ దానికి కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని, ఇలా నిబంధనలకు విరుద్ధంగా పూర్తికాని భవనానికి అనుమతులు ఇవ్వడమేంటని, పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్లకు అధికారులు అనుమతుల రూపంలో ఇచ్చేసారని సమాచారం ఉందని, అందుకే దర్జాగా ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్స్ ల ప్రక్రియ చేపట్టారని ఇటువంటి విద్యాసంస్థలపై తక్షిణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే ట్రస్మా ఆధ్వర్యంలో దీని వెనకాల ముడుపుల బాగోతాన్ని బయటకు తీసే వరకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఇదే విషయమై ఎంఈఓను వివరణ కోరగా మండల కేంద్ర ఎస్ ఎస్ ఆర్ పాఠశాలపై ఫిర్యాదు అందడంతో ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టరాదని, అలాగే ప్రచారం కూడా చేసుకోకూడదని నోటీసులు జారీ చేశామని, అడ్మిషన్స్ చేపట్టినట్టయితే తప్పకుండా చర్య తీసుకుంటామని ఎంఈఓ అవధూత గంగాధర్ తెలిపారు.
స్టేట్ జైంట్ సెక్రెటరీ నవోదయ రమేష్, జిల్లా జనరల్ సెక్రెటరీ లిటిల్ ఫ్లవర్ అరుణ్, నందిపేట ట్రస్మ అధ్యక్షులు చుక్కబట్ల దేవన్న, నందిపేట డొంకేశ్వర్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
