‘జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆకస్మికంగా అజ్ఞాతం లో కి వెళ్లడం జిల్లా రాజకీయాల్లో చర్చ నీయాంశం అయింది.
బిఆర్ యస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే హైదారాబాద్ జరిగిన ఓ భూ వివాదం నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం వుండడంతో ముందు జాగ్రత్తగా సదరు మాజీ ఎమ్మెల్యే గన్ మెన్ కు చెప్పకుండా అజ్ఞాతంలో కి వెళ్లారు దాదాపు ఆయన 20 రోజులుగా ఎవరికి అందుబాటులోకి రావడం లేదు.
బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. కెసిఆర్ కేటీఆర్ లకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉంది.ఆయన ప్రత్యర్థుల మీద విరుచుక పడే పేరుంది.
అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో సదురు ఓడి పోయాక అధికార పార్టీ అతనే టార్గెట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో లోనే హైదారాబాద్ లో కోట్లాది రూపాయల విలువైన భూమి విషయంలో సదరు మాజీ ఎమ్మెల్యే మీద బాధితులుతీవ్రమైన ఆరోపణలు చేయడమే కాకుండా న్యాయం కోసం అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు.
ఆ భూమి పంచాయితీ లోనూ మాజీ ఎమ్మెల్యే మీద పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
కెసిఆర్ కేటీఆర్ లకు సన్నిహితుడు కావడంతో తదుపరి కేసు దర్యాప్తు కూడా క్లిష్టంగా మారే ప్రమాదం ఉండడంతో అజ్ఞాతంలోకి వెళ్లి పోయినట్లు బిఆర్ యస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
న్యాయ పరమైన రక్షణ దక్కే దాక పోలీసులకంట పడొద్దని భావిస్తున్నారు అందుకే తన సన్నహితులుండే దుబాయి దేశం కు వెళ్లారని సమాచారం.
అక్కడ కూడా హోటల్ కే పరిమితం ఉంటున్నారట.అందుకే ఎమ్మెల్సీ కవిత ఈ మద్యే జిల్లాకు వచ్చినప్పటికి కీలక పదవీ లో ఉన్న మాజీ అడ్రస్ లేకుండా పోయారు.
అప్పుడే పార్టీ శ్రేణులు అరా తీశాయి. ఇప్పటికే మరో మాజీ ఎమ్మెల్యే సీఎం ఆర్ యఫ్ బియ్యం స్కామ్ లో చిక్కి ఆ కేసుల నుంచి ఎవరికి దొరక్క కుండా దుబాయి లోనే మకాం వేశారు. ఆయన అక్కడేఉండి సతీమణి ముందు పెట్టి సెగ్మెంట్ లో పార్టీ వ్యవహారాలు సాగిస్తున్నారు.
