HomeTelanganaNizamabadపసుపు నిజామాబాద్‌లో పండిస్తే.. బోర్డు ఢిల్లీలో ఎందుకు?......మానాల

పసుపు నిజామాబాద్‌లో పండిస్తే.. బోర్డు ఢిల్లీలో ఎందుకు?……మానాల

నిజామాబాద్‌లో పసుపు పండిస్తే, బోర్డును ఢిల్లీలో ఎందుకు పెట్టారని డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు వుండాలన్నారు ఆయన మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు .

పసుపు ధర ఒక్కసారిగా పడిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని . ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పసుపు కొనుగోళ్లకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్‌ను కలిసి కోరామని .

రైతు పసుపు బోర్డు తీసుకొచ్చానని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని.. జిల్లాకు చెందిన వారే పసుపు బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పటికీ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

పసుపు రైతులకు అన్యాయం జరుగుతుంటే అర్వింద్‌ ఎక్కడ మొహం పెట్టుకుంటాడో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఏడాది పసుపు ధర పెరిగితే అది కేంద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులు చేయడం ద్వారానే పెరిగిందని చెప్పి ఇప్పుడు పసుపు ధర తగ్గిన క్రమంలో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రైతుల సమస్యలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించిన ఒడిపోవడం నిరాశ పరిచిందని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత 56 వేల ఉద్యోగాలు ఇచ్చిన పట్టబద్రులు ఎందుకు ఓటు వేయలేరో అనేది అర్థం కావడం లేదు అని,కొంతకాలంగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు,బదిలీలు లేక ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు ప్రమోషాన్లు ఇచ్చిందని అయిన కూడా ఎన్నికల్లో ఓటు వేయకపోవడం కొంత నిరాశ పరిచ్చిందని తెలిపారు.

ఈ సమావేశంలో నుడా ఛైర్మెన్ కేశ వేణు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments