HomePOLITICAL NEWSప్రజాక్షేత్రంలోకి కేటీఆర్ .....జిల్లాలో విస్తృత పర్యటనలు .....వరంగల్ సభ కోసం .....సన్నాహక సమావేశాలు .....

ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్ …..జిల్లాలో విస్తృత పర్యటనలు …..వరంగల్ సభ కోసం …..సన్నాహక సమావేశాలు …..

అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టె కార్యాచరణకు కేటీఆర్ సమాయత్తం అవుతున్నారు.అధికారం కోల్పోయాక పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. ఎన్నికల ఓడి పోయాక మాజీ ఎమ్మెల్యే లు సైతం నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేక పోతున్నారు.

దీనితో క్యాడర్ ను భుజం తట్టేవారే లేకుండా పోయారు.అధికారం కోల్పోయినా క్షేత్ర స్థాయిలో ఇంకా క్యాడర్ పార్టీలోనే కొనసాగుతుంది. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా చెయ్యాలని భావిస్తున్న నేపథ్యంలో క్యాడర్ లో మునుపటి ఉత్తేజం తేవాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నారు.

ఎలాగో వరంగల్ సభ కు భారీఎత్తున ప్రజలను సమీకరించాలని భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇందుకు తగ్గట్టుగా సన్నాహక సమావేశాలు జరపడానికి సిద్ధం అవుతుంది.

ఈ సమావేశాలకు తానే స్వయంగా హాజరు కావాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటన వుండేలా తెలంగాణ భవన్ భారీ స్కెచ్ వేస్తుంది.ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలసమావేశాలకు ముహూర్తం ఖరారు చేసారు.

అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా ఆయా జిల్లాలు చుట్టేయనున్నారు.వరంగల్ సభ సక్సెస్ కోసం ఆయన పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేయనున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments