HomeCRIMEటాస్క్ ఫోర్స్ ముసుగు లో వసూళ్ళ దందా …….ఫోన్ పే ద్వార కూడా చెల్లింపులు ……..అవుట్...

టాస్క్ ఫోర్స్ ముసుగు లో వసూళ్ళ దందా …….ఫోన్ పే ద్వార కూడా చెల్లింపులు ……..అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బరితెగింపు ……..కందుకుర్తి వద్ద అడ్డా

ఎలాగో పోలీసులు యూనిఫామ్ లో నడి రోడ్డు మీద వసూళ్ల కోసం తెగబడుతున్నారు కదా వారి పేరుతొ తామెందుకు వసూళ్ల దందా చేయద్దు అనుకున్నాడు ఓ ప్రబుద్దుడు ఎలాగో అవుట్ సోర్సింగ్ ద్వార కలెక్టరేట్ లో పనిచేస్తుండడం పోలీసుల తో మంచి దోస్తాని కూడా కుదిరింది.

ఇంకేముంది అడ్డదారులు వసూళ్ళ దందా కు తెర తీశారు. ఇందుకోసం టాస్క్ ఫోర్స్ సీఐ అవతారం ఎత్తాడు. రెంజల్ మండలం కందుకుర్తి నే అడ్డా గా చేసుకున్నాడు. మహారాష్ట్ర కు సరిహద్దు కావడంతో ఆ వైపు వెళ్లే వాహనాలను అపి తాను టాస్క్ ఫోర్స్ సీఐ అంటూ ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో రిక్షాలు …

టాటా ఏసీ లాంటి తేలికపాటి వాహనాలను లక్ష్యంగా చేసుకొని వాటినే అపి అచ్చంగా పోలీస్ లతరహాలోనే వాహనదారులను గద్దించడం వాహనాల్లో ఏమి తీసుకెళ్తున్నారంటూ దబాయించడం ఆపై వారిని వాహనం సీజ్ చేస్తానంటూ ధమ్కీ ఇవ్వడం తో ప్రయాణం లో ఉన్న వారు అధికారి తో పేచీ ఎందుకులే అనుకోని నయానో భయానో ఇచ్చి వెళ్తున్నారు అబ్బో ఇదేదో బాగుంది అనుకున్నాడు

ఆ ప్రబుద్దుడు నిజామాబాద్ బోధన్ ల నుంచి పీడీఎస్ బియ్యం ఎక్కువగా అక్రమ రవాణా అవుతుందని తెలుసుకున్నాడు.బియ్యం లోడ్ లతో వెళ్లే వాహనాలను టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టాడు. మహారాష్ట్ర కు వెళ్లే వాహనాలకు బాసర వద్ద పోలీసులు వసూళ్ల బెడద మితిమీరడం తో పీడీఎస్ స్మగ్లర్లు రూట్ మార్చేశారు కందుకుర్తి మీదుగా వయా ధర్మాబాద్ నాందేడ్ వెళ్తున్నారు సోమవారం నిజమాబాద్ నగరం కు చెందిన ఇద్దరు ఆటో రిక్షా లో 10 క్వింటాళ్ల బియ్యం వెళ్తుండగా ఫెక్ టాస్క్ ఫోర్స్ సీఐ కంటబడ్డాడు.

పది వేలు ఇస్తే నే వాహనం వదిలేస్తా లేదంటే స్టేషన్ కు తీసుకెళ్లి ఆటో సీజ్ చేసి జైలు కు పంపిస్తా అంటూ బెదిరించాడు.దీనితో బెదిరిపోయిన సదురు ఆటోవాలా కాళ్లబేరం కు దిగాడు అయిదు వేలకు బేరం కుదుర్చుకున్నాడు. కానీ తన వద్ద రెండు వేల నగదు వుందని చెప్పగా ఫోన్ పే ద్వార అప్పు తీసుకోని తనకు బదిలీ చెయ్యాలని సలహా ఇచ్చాడు.

అందుకే సరే అన్న ఆటో వాలా హుటాహుటిన ఫోన్ పే లో నగదు తెప్పించుక్ వెంటనే మూడు వేల రూపాయలు సదురు టాస్క్ ఫోర్స్ అధికారికి ఫోన్ పే లో బదిలీ చేసాడు.ఈ రోడ్డు ఎవరు వాహనం ఆపిన సరే తనకు ఫోన్ చెయ్యాలని భరోసా ఇచ్చి తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం గమనార్హం.

రోజువారీగా తాను ఏ వాహనం నుంచి ఎంత వసూలు చేస్తుంది కూడా చెపుతూ బియ్యం లోడ్ వాహనాలు ఈ రోడ్డు లో వెళ్తే తనకు సమాచారం ఇవ్వాలని అందుకు మంచి కమిషన్ కూడా ఇస్తానని భరోసా ఇవ్వడం కొసమెరుపు !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments