HomeTelanganaNizamabadమరో తెరమీదకి విస్తరణ …..ఈసారి ఢిల్లీ నుంచే సంకేతాలు ….. ఈసారైనా .జిల్లా కు ప్రాతినిధ్యం...

మరో తెరమీదకి విస్తరణ …..ఈసారి ఢిల్లీ నుంచే సంకేతాలు ….. ఈసారైనా .జిల్లా కు ప్రాతినిధ్యం దక్కేనా ……. అంతు చిక్కని పీసీసీ చీఫ్ వ్యూహం …….

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి వర్గ విస్తరణ మరోసారి తెరమీదికి వచ్చింది. ఈసారి విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూల సంకేతాలు ఇచ్చింది.

దాదాపు ముహూర్తం కూడా ఖరారు చేసారని అధికార పార్టీ కీలక నేతలే చెప్తున్నారు. తెలుగునాట కొత్త సంవత్సరం ఉగాది తర్వాతే కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారని, ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు శనివారం అసెంబ్లీ లాబీల్లో పలువురు ఎమ్మెల్యే లు సైతం ప్రస్తావించారు . అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి , జాబితా ఖరారు చేసుకుని వస్తారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది.

క్యాబినెట్ ఆరు ఖాళీ లున్నాయి. సామజిక సమీకరణ లు కుదరకే విస్తరణ కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సీఎం అనేక సార్లు ప్రస్తావించినా వారు దాటవేస్తూ వచ్చారు.దీనితో రేవంత్ కు అధిష్టానం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా సాగింది.

కానీ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గా మీనాక్షినటరాజన్ రంగంలోకి దించారు. ఆమె సీనియర్ నేతలతో సుదీర్ఘ సమాలోచనలు జరిపారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే అధిష్టానం మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చారని సమాచారం.

ఆమె ఇచ్చిన నివేదిక మేరకు ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంలో ఢిల్లీ పెద్దలు ఓ అంచనాకు వచ్చారు. అంతేకాదు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఒకరో ఇద్దరికో ఉద్వాసన కూడా ఖాయం అయిందనే ప్రచారం తో మంత్రుల్లో టెన్షన్ మొదలయ్యింది.

ఎవరికీ ఉద్వాసన ఉంటుందనే పక్కాగా సమాచారం ఉన్నా ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది మాత్రం అధిష్ఠానం బయటికి పొక్కనీయడం లేదు. అందుకే ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.

నిజామాబాద్ జిల్లాకు బెర్త్ ఖాయమేనా ?

ఉగాది తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరగడం ఖాయమని పార్టీ పెద్దలే చెప్తున్నారు. ఈసారైనా ఉమ్మడి జిల్లానుంచి మంత్రి మండలి లో ప్రాతినిధ్యం దక్కుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఉమ్మడి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లున్నారు.బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. దీనితో అయిదుగురు ఎమ్మెల్యే లలో ఒక్కరికైనా అవకాశం దక్కాలనేది పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

అయిదు గురు ఎమ్మెల్యే ల్లో ఇద్దరు గతంలో మంత్రులుగా పనిచేసిన వారే! కానీ ఇందులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కరే మొదటి నుంచి రేసులో ఉన్నారు.

ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు లేక పోయిన ఆయన సీఎం రేవంత్ కు సమీప బంధువు. అదొక్కటే ఆయనకున్న మార్గం. ఆయన గతంలో వైయస్ కిరణ్ కుమార్ క్యాబినెట్ లలో పనిచేసారు.

కానీ అప్పుడు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఎవ్వరు లేరు డీఎస్ షబ్బీర్ సురేష్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలు ఓడిపోవడం తో సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వడం అనివార్యం అయింది. కానీ ఈసారి అయిదు గురు ఎమ్మెల్యే లున్నారు వీరిలో ఎల్లారెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే లకు ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

సుదర్శన్ రెడ్డికి మొదటి దఫాలోనే మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ అధిష్టానం ఆయన కు ఏకంగా స్పీకర్ పదవి కట్టబెట్టింది. కానీ ఆయన ఆ పదవి తీసుకోవడానికి ససేమిరా అన్నారు. అదే అధిష్టానం వద్ద ఆయన కు ప్రతికూలంగా మారింది.

ధిక్కారం ఫై ఢిల్లీ పెద్దలు నొచ్చుకున్నారు.కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పుడు విస్తరణ జరిగిన మంత్రి పదవి ఖాయమని అనేక పర్యాయాలు భరోసా ఇచ్చారు. ఆయన సన్నిహితుల ముందే రేవంత్ ఎలా చెప్పడం గమనార్హం .మంత్రి పదవి సంగతి ఎలా ఉన్న ఆయన హోం మంత్రి కాబోతున్నారంటూ వారు ఊరువాడా ఉదరగొట్టేస్తున్నారు.

దశాబ్ద కాలంగా పార్టీ తిరుగు లేని ఆధిపత్యం చెలాయించిన ఆయన కు ఇంతకాలం పార్టీలో గట్టి ప్రత్యర్థి గా ఉన్న మహేష్ గౌడ్ అనూహ్యంగా పీసీసీ చీఫ్ అయ్యారు. అదే సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు ప్రతికూలంగా మారనుందని ప్రచారం పార్టీ వర్గాల్లో మొదలయ్యింది.

సుదర్శన్ రెడ్డి మంత్రి పదవీ విషయంలో మహేష్ ఖచ్చితంగా తెరవెనుక పావులు కదు పుతారనేది ఆయనను దగ్గర గా చుసిన నేతలు చెప్తున్నారు. ఎందుకంటే మహేష్ కు ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ జిల్లా నుంచి మంత్రి మండలి లో ప్రాతినిధ్యం అనివార్యం కాబట్టి సుదర్శన్ రెడ్డి ని కాదని మొదటి ఎమ్మెల్యే లుగా అవకాశం ఇవ్వడం దుస్సాధ్యం .!

వచ్చేనెల మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండొచ్చని సుదర్శన్‌రెడ్డి సైతం స్పష్టం చేశారు . అసెంబ్లీలో ఆయన మీడియా తో మాట్లాడారు తనకు ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేస్తానని కామెంట్ చేశారు. గతంలో వైద్యశాఖ, మైనర్ ఇరిగేషన్ శాఖల బాధ్యతలు నిర్వహించినట్టు గుర్తుచేశారు.

ఆ శాఖల్లోని లోటుపాట్లను ఆధ్యయనం చేసి గాడిలో పెట్టానని వివరించారు. ‘హోం మంత్రి పదవి మీకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది కదా?’ అనే ప్రశ్నకు.. ఏ శాఖ ఇచ్చినా రూల్స్ ప్రకారం పనిచేసే వ్యక్తిత్వం తనదని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments