వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్లితే..మృతుడు శంకర్ బతుకుతెరువు కోసం మహారాష్ట్ర నుంచి పచ్చల నడుకుడ గ్రామానికీ కూలీ పనుల నిమిత్తం సుమారుగా 9 నెలల క్రితం వచ్చి ఓ ఇంట్లో కిరాయి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇతనితో పాటు బాలాజీ అనే మరో వ్యక్తి ఇద్దరు కలిసి కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం శంకర్, బాలాజీ ఇద్దరు ఉంటున్న ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు, గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది కి తెలుపగా అక్కడికి వెళ్లి పరిశీలించగా శంకర్ హత్యకు గురై ఉన్నట్లు తెలిపారు. శంకర్ శరీరం ఉబ్బిపోయి ఉండడంతో హత్య జరిగి రెండు లేదా మూడు రోజులు జరుగుతుందని తెలుస్తుంది. శంకర్ తో కలిసి ఉంటున్న బాలాజీ లేకపోవడంతో పలు అనుమానాలకు తావుతీస్తుంది.
